ODI World Cup 2023 | ఓపెనర్ల శతక భాగస్వామ్యం.. మూడో వికెట్ కోల్పయిన లంక
ODI World Cup 2023 | శ్రీలంక – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో లంక ఓపెనర్లు శతక భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఆసీస్ బౌలర్లు తేలిపోయారు.
ODI World Cup 2023 | లక్నో వేదికగా శ్రీలంక – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో లంక ఓపెనర్లు శతక భాగస్వామ్యంతో అద్భుత ఆరంభాన్నిచ్చారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న లంకకు ఓపెనర్లు తొలి వికెట్కు 21.4 ఓవర్లలో 125 పరుగులు జతచేశారు. పతుమ్ నిస్సంక (67 బంతుల్లో 61, 8 ఫోర్లు), కుశాల్ పెరీరా (82 బంతుల్లో 78 నాటౌట్, 12 ఫోర్లు)లు ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. పటిష్టమైన కంగారూల బౌలింగ్ను లంక ఓపెనర్లు ఆటాడుకున్నారు.
ఆదినుంచి ఆసీస్ బౌలింగ్ దళాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కున్న లంక ఓపెనర్లు.. రన్ రేట్ ఆరుకు పడిపోకుండా చూసుకున్నారు. ఆసీస్ సారథి పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్తో పాటు మార్కస్ స్టోయినిస్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. పేసర్లతో పాటు స్పిన్నర్లు ఆడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ప్రభావం చూపలేకపోయారు.
57 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసిన పెరీరా ఆ తర్వాత దూకుడు పెంచి ఆడుతున్నాడు. మరోవైపు 58 బంతుల్లో అర్థశతకం సాధించిన నిస్సంక.. లంకకు మెరుగైన స్కోరు సాధించే దిశగా శుభారంభాన్ని అందించారు. సెంచరీ దిశగా సాగుతున్న పెరీరాను కమిన్స్ 26వ ఓవర్లలో రెండో బంతికి బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపటికే ఆడమ్ జంపా.. కెప్టెన్ కుశాల్ మెండిస్ (9) ను ఔట్ చేశాడు. 28 ఓవర్లకు లంక.. మూడు వికెట్లు కోల్పోయ 165 పరుగులు చేసింది. సమరవిక్రమ (1 నాటౌట్), చరిత్ అసలంక క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

