
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్ ప్రాతినిధ్యంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు తెరపడింది. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అయోమయం నెలకొన్న నేపథ్యంలో జొకో ప్రాతినిధ్యంపై ఇన్నిరోజులు ఏర్పడిన ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది. వైద్య మినహాయింపు కింద తనకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు ప్రత్యేక అనుమతి లభించిందని జొకో మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. తన టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు కెరీర్లో మరో గ్రాండ్‌స్లామ్‌తో సరికొత్త చరిత్ర లిఖించాలన్న పట్టుదలతో జొకో ఉన్నాడు.