మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లోకి నోవాక్ జోకోవిచ్ ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో ఆ టెన్నిస్ స్టార్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్‌తో పాటు రౌండ్-16లోనూ ఒక్క సెట్ కూడా గెలవకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించాడతను. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. క్వార్టర్స్‌లో ఓటమి అంచు నుంచి బయటపడ్డ అతను.. చాలా లక్కీగా సెమీస్‌కు ఎంట్రీ ఇచ్చాడు. రాడ్ లావెర్ ఎరినా లో ఇవాళ జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ నుంచి ఇటలీ ప్లేయర్ లోరెంజో ముసెటి గాయంతో తప్పుకున్నాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ముసెటి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.ఇక గెలుపు ఖాయం అనుకున్న దశలో.. తొడ కండరాలు పట్టేయడంతో ముసెటి మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. 6-4, 6-3 స్కోరుతో ముసెటి తొలి రెండు సెట్లను కైవసం చేసుకున్నాడు. ఇక మూడవ సెట్లోనూ 3-1 తేడాతో ఆధిపత్యంలో కొనసాగుతున్నాడు. ఆ సమయంలో ముసెటి కుడి తొడలో తీవ్రమైన నొప్పి వచ్చింది. ఆ దశలో అయిదో సీడ్ ముసెటి రిటైర్డ్ హార్ట్ అయ్యాడు.
గాయం వల్ల తప్పుకోవడంతో లక్కీగా జోకోవిచ్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. అంతకుముందు రౌండ్-16లో కూడా జాకబ్ మెన్సిక్ గాయంతో తప్పుకున్నాడు. ఆ మ్యాచ్‌లో జోకోవిచ్‌కు వాకోవర్ లభించింది. దీంతో రెండు మ్యాచుల్లో ఒక్క సెట్ కూడా గెలవకుండా జోకోవిచ్ సెమీస్‌లోకి ఎంటర్‌కావడం విశేషం.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు జోకోవిచ్. ఆ గ్రాండ్‌స్లామ్‌లో 103వ మ్యాచ్ గెలిచాడు. గతంలో రోజర్ ఫెదరర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాఆడు. మెల్బోర్న్ పార్క్‌లో స్విస్ ప్లేయర్ ఫెదరర్ కూడా వందకు పైగా మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. మూడు రకాల గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జోకోవిచ్ వందకుపైగా మ్యాచ్‌లను గెలవడం గమనార్హం.