లండన్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం సుమారు రెండేండ్లుగా వేచిచూస్తున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆశలు వింబుల్డన్‌లో కూడా నెరవేరకపోవడంతో ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వస్తున్న ఊహాగానాలపై అతడు స్పందించాడు. సెమీస్‌లో ఓడినప్పటికీ తనకు ఇదే ఆఖరి వింబుల్డన్ అయితే కాదని, వచ్చే ఏడాది కచ్చితంగా ఆడతానని జొకో స్పష్టం చేశాడు. సెమీస్‌లో సిన్నర్ చేతిలో ఓడిన తర్వాత జొకో మాట్లాడుతూ.. ‘నేటి మ్యాచ్‌తో నా వింబుల్డన్ కెరీర్ ముగియలేదు. కచ్చితంగా వచ్చే ఏడాది ఇక్కడ ఆడేందుకు ప్లాన్ చేసుకుంటున్నా. కనీసం మరో ఏడాది అయితే ఆడతా’ అని అన్నాడు. సెమీస్‌లో తన ప్రదర్శనపై జొకో అసంతృప్తి వ్యక్తం చేశాడు.