SL vs RSA : టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) దుమ్మురేపింది. తొలి ఐసీసీ ట్రోఫీ వేటను ఘనంగా ఆరంభించింది. న్యూయార్క్‌లోని నస్సౌ స్టేడియంలో పేసర్ అన్రిచ్ నార్జ్(4/7) సూపర్ స్పెల్‌తో శ్రీలంక(Srilanka) ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అనంతరం స్వల్ప ఛేదనలో ఓపెనర్ క్వింటన్ డికాక్(20), హెన్రిచ్ క్లాసెన్(19 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(13)లు రాణించారు. ఆదిలోనే రెండు వికెట్లు పడినా ఓపికగా ఆడి జట్టును గెలిపించారు. 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సఫారీ జట్టు మెగా టోర్నీలో అదిరే బోణీ కొట్టింది. సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ప్రొటిస్ టీమ్ విజయానికి పునాది వేసిన నోర్జి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
ఐసీసీ టోర్నీలో చోకర్స్‌గా ముద్రపడిన దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకను వణికించింది. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై నార్జ్ వికెట్ల వేట కొనసాగించగా.. రబడ, కేశవ్ మహరాజ్‌లు తమ వంతుగా సాయం చేశారు. దాంతో, శ్రీలంకను మర్క్రమ్ సేన 77 పరుగులకే కట్టడి చేసింది.
Quinton de Kock and Tristan Stubbs hold the fort for South Africa against Sri Lanka with 31 runs needed to win 👏#T20WorldCup | #SLvSA | 📝: https://t.co/BdP8A3bbDG pic.twitter.com/yYIu8r2e7v
— ICC (@ICC) June 3, 2024
ఆ తర్వాత స్వల్ప ఛేదనలో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(4), ఆ తర్వాత కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(12)లు త్వరగానే వెనుదిరిగారు. 23 పరుగులకే రెండు వికెట్లు పడినా ఓపెనర్ క్వింటన్ డికాక్(20), ట్రిస్టన్ స్టబ్స్(13)లు సమయోచితంగా ఆడారు. శ్రీలంక బౌలర్లు డాట్ బాల్స్‌తో ఒత్తిడి పెంచినా ఇద్దరూ చెత్త షాట్లకు పోలేదు. మూడో వికెట్‌కు 28 రన్స్ జోడించారు. అయితే.. 11వ ఓవర్లో హసరంగ రిటర్న్ క్యాచ్‌తో డికాక్ వెనుదిరిగినా.. హెన్రిచ్ క్లాసెన్(19 నాటౌట్).. స్టబ్స్, డేవిడ్ మిల్లర్(6 నాటౌట్)తో కలిసి లాంఛనం పూర్తి చేసి జట్టుకు రెండు పాయింట్లు అందించారు.
The best figures by a South African in the men’s #T20WorldCup 💥
Anrich Nortje was on 🔥 for the Proteas! #SLvSA | 📝: https://t.co/NPEuXWWBvH pic.twitter.com/VTv7ieZJ11
— ICC (@ICC) June 3, 2024
న్యూయార్క్‌లో టాస్ గెలిచిన శ్రీలంక సంతోషం క్షణాల్లోనే ఆవిరైంది. డేంజరస్ పథుమ్ నిస్సంక(3)ను ఔట్ చేసి బార్ట్‌మన్ సఫారీ జట్టుకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత కమిందు మెండిస్(19), కుశాల్ మెండిస్(11)లు కాసేపు ప్రతిఘటించారు. అయితే.. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడినీ అన్రిచ్ నోర్జి పెవిలియన్ పంపి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ సైతం తిప్పేయడంతో లంక 40కే సగం వికెట్లు కోల్పోయింది.
A career-best performance from Anrich Nortje helps South Africa restrict Sri Lanka to their lowest score in Men’s T20Is 👏#T20WorldCup | #SLvSA | 📝: https://t.co/eTTQBZAe5w pic.twitter.com/ocCzvuT6pR
— ICC (@ICC) June 3, 2024
ఆ కాసేపటికే అసలంక(6)ను నొర్జి పెవిలియన్ పంపడంతో లంక ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో మాజీ సారథి దసున్ శనక(9), సీనియర్ ఆల్‌రౌండర్ ఎంజెలో మాథ్యూస్(16)లు 23 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. రబడ సూపర్ బంతితో శనకను బౌల్డ్ చేయగా.. మాథ్యూస్‌ను నార్జ్ వెనక్కి పంపాడు. అంతే.. ఆలౌట్ ప్రమాదంలో పడిన లంక థీక్షణ(5) వికెట్‌తో 77 పరుగులకే ఆలౌటయ్యింది.