ఢాకా: వచ్చే నెలలో జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో ఆడేదే లేదని మంకు పట్టు పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ను బుజ్జగించే చర్యలకు దిగిన ఐసీసీకి నిరాశే ఎదురైంది. ఈ మెగా టోర్నీలో గ్రూప్ దశ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలో కాకుంటే చెన్నై, తిరువనంతపురంలో ఆడాలని ఐసీసీ.. బీసీబీకి సూచించగా బంగ్లాదేశ్ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. భారత్‌లో తప్ప ఇంకెక్కడైనా తాము ప్రపంచకప్ ఆడతామని ఆ దేశ స్పోర్ట్స్ అడ్వైజర్ అసిఫ్ నజ్రుల్ తెలిపాడు. ఐసీసీ సూచనల అనంతరం అసిఫ్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటికే చెప్పా.
మేం కోల్కతానో, ముంబై గురించో మాట్లాడటం లేదు. ఇండియా అంటే ఇండియానే. మీరు శ్రీలంక, యూఏఈ.. ఆఖరికి పాకిస్థాన్‌లో ఆడమన్నా ఆడతాం గానీ భారత్‌లో ఆడేది లేదు’ అని చెప్పాడు. ఐసీసీ నిజంగా స్వతంత్రంగా వ్యవహరిస్తూ భారత నియంత్రణలో లేకుంటే మేం శ్రీలంకలో ఆడేందుకు అనుమతినివ్వాలి’ అని వ్యాఖ్యానించాడు. ఇదిలాఉండగా బంగ్లా మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై నుంచి చెన్నై, తిరువనంతపురానికి మారుస్తారన్న విషయంపై తమకు సమాచారం లేదని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలపడం గమనార్హం.