బ్రిస్బేన్: బ్రిస్బేన్‌లో వర్షం కురుస్తోంది. దీంతో ఆస్ట్రేలియా, భారత్(AUSvIND) మధ్య జరుగుతున్న మూడవ టెస్టుకు అంతరాయం ఏర్పడింది. టీ బ్రేక్ తర్వాత కూడా జల్లులు కురుస్తున్నాయి. గబ్బా పిచ్‌పై కవర్స్ అలాగే ఉంచారు. రెండో సెషన్లో పూర్తిగా ఆట సాగలేదు. తొలుత టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నది. అయితే 13.2 ఓవర్లు బౌల్ చేయగానే వర్షం స్టార్ట్ అయ్యింది. అప్పటికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. ఖవాజా 19, మెక్‌స్వీనే 4 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ తరపున ముగ్గురు పేసర్లు బరిలోకి దిగారు. బుమ్రా, సిరాజ, ఆకాశ్ దీప్ బౌలింగ్ చేశారు. అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇరు జట్లు 1-1 తేడాతో సమంగా ఉన్నాయి.
Tea has been taken here at The Gabba.
And the waiting game continues.
The umpires will undertake an inspection shortly. #AUSvIND pic.twitter.com/JW3ZVTsG28
— BCCI (@BCCI) December 14, 2024