Asia Cup | భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో ఆసియా కప్‌లో పాల్గొననున్నది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనున్నది. పాక్‌తో మ్యాచ్‌ను టీమిండియా ఆడుతుందా? లేదా? అన్న అనుమానాలున్నాయి. అయితే, తాజాగా బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. భారత జట్టును ఆసియా కప్‌లో పాల్గొనకుండా కేంద్ర ప్రభుత్వం ఆపదంటూ క్రీడల మంత్రిత్వశాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ కథనం పేర్కొంది. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరుగడం లేదని, ఆసియా కప్ వంటి టోర్నమెంట్లలో జట్లు ఆడకుండా ఆపలేమని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నట్లుగా నివేదిక తెలిపింది. ఆసియా కప్ సెప్టెంబర్ 9న మొదలు కానున్నది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనున్నది. పాక్‌తో మ్యాచ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడిని గుర్తు చేస్తూ అమాయక పర్యాటకుల ప్రాణాలు తీశారని.. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశంతో క్రికెట్ ఏంటని పలువురు మండిపడుతున్నారు. ఆసియా కప్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరుగడం లేదని.. మల్టీ నేషనల్ టోర్నీల్లో ఆడకుండా ఆపలేమని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ కార్యకలాపాలకు సంబంధించి పాకిస్తాన్‌తో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఓ విధానం అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. పాకిస్తాన్‌తో పాల్గొనే క్రీడా కార్యకమాలపై భారతదేశ విధానం.. ఆ దేశంతో వ్యవహరించే మొత్తం విధానాన్ని ప్రతిబింబిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ఒక దేశంలోని ద్వైపాక్షిక క్రీడా కార్యక్రమాల విషయానికి వస్తే.. భారత జట్లు పాకిస్తాన్లో జరిగే పోటీల్లో పాల్గొనవు.. పాకిస్తాన్ జట్లను భారత్‌లో ఆడేందుకు అనుమతించమని.. అయితే, మల్టీ నేషనల్ టోర్నీలు మాత్రం ప్రభావితం కావు. ఆసియా కప్ మల్టీ నేషనల్ టోర్నీ కాబట్టి భారత క్రికెట్ జట్టును మేం అడ్డుకోం. కానీ, పాకిస్తాన్ భారత గడ్డపై ద్వైపాక్షిక మ్యాచులు ఆడటానికి అనుమతించం. కానీ, ఒలింపిక్ చార్టర్‌కు కట్టుబడి ఉన్నందున మల్టీ నేషనల్ టోర్నమెంట్లలో ఆడకుండా వారిని ఆపం’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఆసియా కప్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. ఈ టోర్నీకి యూఏఈ వేదికగా జరుగనున్నది. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. టోర్నీ బీసీసీఐ నిర్వహించనుండగా.. యూఏసీ వేదికగా నిర్వహించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, యూఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, ఒమన్ జట్లు కూడా ఈ టోర్నమెంట్లో ఆడుతున్నాయి.
అయితే, ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్ సంఘటనల నేపథ్యంలో మ్యాచ్‌పై పలు పార్టీల నేతలతో పాటు పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల భారత క్రికెటర్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరించిన విషయం తెలిసిందే. హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ వంటి చాలా మంది మాజీ క్రికెటర్లు ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడవద్దని విజ్ఞప్తి చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు చిరకాల ప్రత్యర్థులు పోటీపడడం ఇదే మొదటిసారి. ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు మూడుసార్లు పోటీపడే అవకాశం ఉంది. గ్రూప్ దశ తర్వాత, రెండు జట్లు సూపర్ ఫోర్ దశలో, ఫైనల్లో కూడా తలపడే అవకాశాలు ఉన్నాయి. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. భారత జట్టు సెప్టెంబర్ 10న యుఏఈతో జరిగే ఆసియా కప్‌లో తన తొలి మ్యాచ్‌ను ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో ఆడుతుంది, గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో జరుగుతుంది.