హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో నిజామాబాద్ అదరగొట్టింది. గురువారం జరిగిన పోరులో నిజామాబాద్ 14-4తో మహబూబాబాద్‌పై అలవోక విజయం సాధించింది.
ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన నిజామాబాద్ వరుస పాయిం ట్లు ఖాతాలో వేసుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 9-0తో నిర్మల్‌పై, ఆదిలాబాద్ 9-2తో కరీంనగర్‌పై, మేడ్చల్ 9-1తో నల్లగొండపై గెలిచాయి.