Sachin – Anderson Trophy : డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో తొలి సిరీస్కోసం భారత జట్టు (Team India) పక్కాగా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో జూన్ 20న జరుగబోయే తొలి టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది శుభ్‌మన్ గిల్ సేన. సిరీస్ ఆరంభానికి మూడు రోజులే ఉంది. దాంతో, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యువ పేసర్ హర్షిత్ రానా (Harshit Rana)ను బ్యాకప్‌గా కొనసాగించనుంది. సుమారు ఆరు వారాల పర్యటన కావడంతో ప్రధాన పేసర్లు గాయపడే అవకాశం ఉంది. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్‌లలో ఎవరైనా గాయపడితే.. వాళ్ల స్థానంలో రానాను ఆడించాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆలోచన. అయితే.. ఈ పేస్ గన్ను అధికారికంగా స్క్వాడ్‌లో భాగమైనట్టుగా బీసీసీఐ వెల్లడించలేదు.
ఐపీఎల్, దేశవాళీలో నిలకడైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో పడిన హర్షిత్ రానా నిరుడు ఆస్ట్రేలియా పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆడింది రెండు మ్యాచులే అయిన తనదైన పేస్‌తో కంగారూలను వణికించాడు. 23 ఏళ్ల రానా ఇప్పటివరకూ రెండు టెస్టులు,5 వన్డేలు, ఒకే ఒక టీ 20 ఆడాడు. లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా ఏ జట్టుతో పాటు వెళ్లిన అతడు రెండు అనధికార టెస్టుల్లో రాణించాడు.
Harshit Rana has been added to the India Test squad as fast-bowling cover for the upcoming series against England
🔗 https://t.co/0V5pjicELM pic.twitter.com/Fh7XwjiCuP
— ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2025
దాంతో, అక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్న రానాను బ్యాకప్‌గా వాడుకోవాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్ భావించారు. అందుకే.. ఈ స్పీడ్‌స్టర్ తొలి టెస్టుకు వైదికైన లీడ్స్‌కు స్క్వాడ్‌తో కలిసి వెళ్లాడు. ప్రస్తుత స్క్వాడ్‌లో ఐదుగురు స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నారు. బుమ్రా, ప్రసిధ్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్‌లు పేస్ యూనిట్లో కీలకం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి, శార్ధూల్ ఠాకూర్లు పేస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు.
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు మరో మూడు రోజులే ఉంది. జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో ఇరుజట్లకు ఇది మొదటి సిరీస్. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) సారథ్యంలో చివరిసారిగా 2007లో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజేతగా నిలిచిన టీమిండియా.. ఈసారి ట్రోఫీ కొల్లగొట్టాలనే కసితో ఉంది. దాంతో, ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం అనిపిస్తోంది. ఇక ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా ఇంగ్లండ్ నుంచి హుటాహుటిన స్వదేశం వచ్చిన గంభీర్ మంగళవారం జట్టుతో కలువనున్నాడు.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
— BCCI (@BCCI) May 24, 2025