(నమస్తే తెలంగాణ క్రీడా విభాగం) : నితీశ్‌కుమార్‌రెడ్డి..ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్లకు ముచ్చెమటలు పట్టిస్తూ తెలుగోడి పౌరుషాన్ని పరిచయం చేసిన నితీశ్ ఒంటరిపోరాటం మరువలేనిది. సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో మరుపురాని ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఓ కన్నీటి గాథ ఉంది. ఏదో ఒక రోజు దేశానికి ప్రాతినిధ్యం వహి ంచి తన తండ్రి కలను సాకారం చేయాలన్న పట్టుదలతో పసి ప్రాయంలోనే బ్యాట్ పట్టిన ఆ కుర్రాడు అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఊహ తెలియని వయసులో కష్టాలు చుట్టుముట్టినా.. తన కెరీర్ కోసం తండ్రి ప్రభుత్వం ఉద్యోగం వదులుకున్నా..నితీశ్ ఎంచుకు న్న లక్ష్యాన్ని ఏనాడు మరువలేదు.
నమ్ముకున్న దోస్తుల చేతిలో మోసపోయిన తం డ్రికి భారత్‌కు ఆడి చూపిస్తానని ఏనాడో మనసులో ఫిక్స్ అయిన ఈ విశాఖపట్నం కుర్రాడు నూనుగు మీసాల వయసులో దిగ్గజాల ప్రశంసల జల్లులో తడిసిముద్దయ్యాడు. తన కెరీర్ కోసం కుటుంబం చేసిన త్యాగాన్ని ఏనాడు మరిచిపోని నితీశ్ దినదిన ప్రవర్ధమానం అన్న తరహాలో ఎదిగిన తీరు యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయ కం. నిఖార్సైన ఆల్‌రౌండర్‌కు పర్యాయపదంగా నిలుస్తూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అపద్భావుండిలా ఆదుకున్నాడు.
ఆసీస్ బౌలింగ్ ధాటికి సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఈ తెలు గు క్రికెటర్ ఒడ్డున పడేసిన తీరు నభూతో నభవిష్యత్. ఆసీస్‌పై తన కొడు కు సెంచరీ కోసం ప్రార్థిస్తూ కనిపించిన తం డ్రి ము త్యాలరెడ్డి ఆనందానికి అవధుల్లేకుం డా పోయాయి. దేశం గర్వపడేలా రాణించిన నితీశ్‌ను చూసి ఆయన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. రెడ్డిని తప్పిస్తే జట్టు సమతూకంగా ఉంటుందన్న సంజ య్ మంజ్రేకర్ లాంటి వారికి నితీశ్ సెంచరీతో చెంప చెల్లుమనేలా సమాధానమిచ్చాడు.