IND vs SL : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న సూపర్ 4 చివరి మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరింది. భారత్ నిర్దేశించిన 202 పరుగుల ఛేదనలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(107) విధ్వంసక సెంచరీ బాదాడు. అతడికి కుశాల్ పెరీరా(58) మెరుపులు తోడవ్వడంతో లంక విజయానికి చేరువైంది. అయితే.. డెత్ ఓవర్లలో వరుసగా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. కానీ, దసున్ శనక (22 నాటౌట్) పోరాటంతో లంక స్కోర్ సమం చేసింది. దాంతో, విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు.
సూపర్ 4లో తొలి రెండు మ్యాచుల్లో విఫలమైనా శ్రీలంక బ్యాటర్లు చితక్కొట్టారు. హార్ది్క్ పాండ్యా వేసిన తొలి బంతినే బౌండరీకి పంపిన ఓపెనర్ పథుమ్ నిశాంక(107) తన ఉద్దేశాన్ని చాటాడు. కుశాల్ మెండిస్(0) సున్నాకే ఔటైనా.. కుశాల్ పెరీరా (58) సాయంతో నిశాంక బౌండరీల మోత మోగించాడు. హర్షిత్ రానా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్.. బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్స్‌లోకి, బౌండరీకి అన్నంతగా దంచేస్తున్నారిద్దరూ. దాంతో.. పవర్ ప్లేలోనే 72 రన్స్ చేసిన లంక.. పది ఓవర్లకు 114 రన్స్‌తో పటిష్ట స్థితిలో నిలిచింది.
This game = anything but dead! Super over it is🔥
Harshit Rana nearly pulled it off but Shanaka holds on to give Sri Lanka a chance here!https://t.co/8SxtYVO0uX pic.twitter.com/7kBEVrf6CU
— ESPNcricinfo (@ESPNcricinfo) September 26, 2025
70 బంతుల్లోనే 127 పరుగులు పిండుకున్న ఈ ద్వయాన్ని వరుణ్ చక్రవర్తి విడదీశాడు. అతడి ఓవర్లో ఫ్రంట్ ఫుట్ వచ్చిన కుశాల్ బంతిని మిస్ కాగా.. శాంసన్ రెప్పపాటులో స్టంపౌట్ చేశాడు. దాంతో.. భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. ఆ వెంటనే అసలంక (5), కమిందు మెండిస్(3)లు పెవిలియన్ చేరినా.. నిశాంక సిక్సర్‌తో మొట్టమొదటి టీ20 సెంచరీ సాధించాడు. అర్ష్‌దీప్ 11 రన్స్ మాత్రమే ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో లంక విజయానికి 12 పరుగులు అవసరం కాగా తొలిబంతికే ఫైన్ లెగ్ దిశలో వరుణ్ చేతికి చిక్కాడు నిశాంక. ఐదో బంతిని షనక(22 నాటౌట్) స్లిప్‌లో బౌండరీకి తరలించాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. షనక రెండు తీశాడు. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.