న్యూఢిల్లీ: అర్మేనియా వేదికగా జరుగుతున్న ఐబీఏ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ టోర్నీలో తొమ్మిది మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు.
ఇందులో పాయల్ (48కి), నిశా (52కి), విని (57కి), శృతి (63కి), అకాంక్ష (70కి), మేఘ (80కి), జతిన్ (54కి), సాహిల్ (75కి), హేమంత్ (80కి) టైటిల్ పోరులో నిలిచారు. మరోవైపు సోమవారం జరిగిన వేర్వేరు బౌట్లలో హర్దిక్ పన్వర్ (80కి), అమీశా కెరెట్టా (54కి), ప్రాచీ (80కి) ప్రత్యర్థుల చేతుల్లో ఓడి రజత పతకాలు కైవసం చేసుకున్నారు.