మేడ్చల్, జనవరి 1: రాష్ట్ర వాలీబాల్ జట్టు సహాయక కోచ్‌గా పూడూరు-కిష్టాపూర్ డివిజన్‌కు చెందిన నిమ్మల ప్రశాంత్‌కుమార్ ఎంపికయ్యాడు. కిష్టాపూర్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో పీడీగా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్ 72వ జాతీయ సీనియర్ టోర్నీలో పురుషుల, మహిళల జట్లకు సహాయక కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ విషయాన్ని గురువారం తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్‌బాబు, హన్మంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కళాశాల చైర్మన్ మల్లారెడ్డితో పాటు పూడూరు గ్రామస్తులు ప్రశాంత్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈనెల 4వ తేదీ నుంచి వారణాసి(ఉత్తరప్రదేశ్) వేదికగా జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ జరుగనుంది.