మాన్సూన్ రెగట్టా షురూ
మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్షిప్ హుస్సేన్ సాగర్ వేదికగా మంగళవారం ప్రారంభమైంది. తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) ఆతిథ్యం ఇస్తోన్న ఈ ఈవెంట్ తొలి రోజు పోటీలకు వాతావరణం ప్రతికూలంగా మారడంతో మూడు రేసులకు ఒక్కటే నిర్వహించారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్షిప్ హుస్సేన్ సాగర్ వేదికగా మంగళవారం ప్రారంభమైంది. తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) ఆతిథ్యం ఇస్తోన్న ఈ ఈవెంట్ తొలి రోజు పోటీలకు వాతావరణం ప్రతికూలంగా మారడంతో మూడు రేసులకు ఒక్కటే నిర్వహించారు. అండర్-15 విభాగంలో జాతీయ ఛాంపియన్ రవి బన్నెలు (వైసీహెచ్) లైన్ జంప్ చేసి డిస్క్వాలిఫై కాగా, రమీజా భాను, లోకేష్ కూడా రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
అయితే, హైదరాబాద్కు చెందిన 13 ఏండ్ల నిల్కొండ మణి తొలి రేసులో టాప్ప్లేస్లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాలికల విబాగంలో సికింద్రాబాద్ క్లబ్కు చెందిన సృష్టి సింగ్ టాప్ సీడ్లుగా బరిలోకి దిగిన జాతీయ చాంపియన్ శృంగారి రాయ్ (సికింద్రాబాద్ క్లబ్), తెలంగాణ నంబర్ 2 ప్లేయర్ రమీజా భానును వెనక్కి నెట్టి అగ్రస్థానం సొంతం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

