Nikhat Zareen : భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) పసిడి పంచ్ విసిరింది. విశ్వవేదికపై తన పంచ్ పవర్ చూపించిన ఇందూరు బిడ్డ దేశానికి ఐదో బంగారు పతకం అందించింది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ (World Boxing Cup Finals)లో చెలరేగిపోయిన నిఖత్ 51 కిలోల విభాగంలో ప్రత్యర్ధి గ్జువాన్ యూ గువో (Xuan Yi Guo)ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన తను.. ఇప్పుడు యావత్ దేశం, తెలంగాణ రాష్ట్రం గర్వపడే విజయం సాధించింది.
స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో నిఖత్ జరీన్ తడాఖా చూపించింది. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన ఆమె.. గ్రేటర్ నోయిడాలో ప్రత్యర్ధులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూ ఫైనల్ చేరింది. సెమీస్‌లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ గనీవ గుల్సెవర్ (Ganieva Gulsevar)పై సంచలన విజయంతో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది నిఖత్.
🇮🇳 Nikhat Zareen claims GOLD at the World Boxing Cup Finals 2025 🥈
She beat Guo Yi Xuan 5-0 in the women’s 51kg 🔝
➡️ Read more: https://t.co/YISFJ5IPrP pic.twitter.com/kLm0nvUUjU
— ESPN India (@ESPNIndia) November 20, 2025
కఠినమైన గుల్సెవర్ను ఓడించి ఉత్సాహంతో ఫైనల్లోనూ జోరు చూపింది నిఖత్. తనదైన దూకుడుతో చైనీస్ తైపీకి చెందిన గువో యూ గ్జువాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన భారత బాక్సర్ 5-0తో విజేతగా నిలిచింది. ఇదే పోటీల్లో నలుగురు భారత బాక్సర్లు స్వర్ణంతో మెరిశారు. 48 కిలోల విభాగలో మీనాక్షి హుడా, ప్రీతి పవార్(54 కిలోలు), అరుంధతి (70 కిలోలు), నుపుర్ షోరాన్(84 కిలోలు) దేశానికి పసిడి పతకం అందించి మురిసిపోయారు.
Nikhat joins the party! 🔥🔥
The women’s 51 kg GOLD🥇 is Nikhat Zareen’s after she beat Xuan Yi Guo of Chinese Taipei.#Boxing 🥊 #WorldBoxingCupFinals pic.twitter.com/1kylQYxAz1
— The Bridge (@the_bridge_in) November 20, 2025
పారిస్ ఒలింపిక్స్‌లో నిఖత్ 50 కిలోల విభాగంలో బరిలో నిలిచింది. ఒలింపిక్ ట్రయల్స్‌లో దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌ను ఓడించిన ఆమె ఈసారి పతకం గెలవడం ఖాయం అనిపించింది. కానీ, అంచనాలు తప్పాయి. అయితే.. తొలి రౌండ్లోనే ఆమెకు చైనా బాక్సర్ వూ యూ (Wu Yu) చెక్ పెట్టింది. దాంతో, పోటీ పడేందుకు 50 కిలోల నిర్ణీత బరువు ఉండేందుకు నిఖత్ రెండు రోజులుగా పడ్డ శ్రమ అంతా వృథా అయింది.