హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో బాక్సర్లను ప్రోత్సహించే దిశగా భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ముందడుగు వేసింది. సోమవారం నిఖత్ జరీన్ ఫౌండేషన్ను ప్రారంభించింది. ఈ వేడుకకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మరింత మంది బాక్సింగ్ చాంపినయ్లను తయారుచేయాలనే సంకల్పంతో నిఖత్ ముందుకురావడం హర్షణీయమన్నారు. అనంతరం ఆయన ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. నిఖత్ మాట్లాడుతూ.. వచ్చే జాతీయ బాక్సింగ్ పోటీలలో పతకాలు కొల్లగొట్టిన తెలంగాణ బాక్సర్లకు తమ ఫౌండేషన్ ద్వారా నగదు బహుమతిని అందించనున్నామని చెప్పింది.