Neymar : బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్(Neymar) వచ్చే సీజన్లో కొత్త క్లబ్‌కు ఆడనున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al Hilal) క్లబ్ ఈ మిడ్‌ఫీల్డర్ మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు విజయవంతం అయ్యాయి. దాంతో, సౌదీ క్లబ్ అతడితో భారీ ఒప్పందం చేసుకుంది. రెండేళ్ల కాలానికి అతడికి 86 మిలియన్ల యూరోలు అంటే.. రూ.900 కోట్లు ముట్టజెప్పనుంది. దాంతో, పారిస్ సెయింట్ జర్మనీ(PSG)తో నెయ్మర్ ఐదేళ్ల బంధానికి తెరపడింది.
నెయ్మర్ 2017లో పీఎస్జీ క్లబ్‌కు మారాడు. అప్పట్లోనే అతడికి పీఎస్జీ రూ. 2వేల కోట్లు ఇచ్చింది. ఈ ఐదేళ్ల కాలంలో నెయ్మర్ అద్భుతంగా రాణించాడు. ఈ మిడ్‌ఫీల్డర్ 118 గోల్స్ చేశాడు. నిరుడు ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో నెయ్మర్ కెప్టెన్సీలోని బ్రెజిల్ సెమీస్‌లోనే వెనుదిరిగింది. దాంతో, ఓటమి బాధను తట్టుకోలేక నెయ్మర్ ఏడ్చేశాడు.
వరల్డ్ కప్ సెమీస్‌లో ఓటమి అనంతరం విలపిస్తున్న నెయ్మర్
క్రోయేషియా(Croatia) చేతిలో 4-2తో ఓడిపోయింది. ఈమధ్యే కిలియన్ ఎంబాపే(Mbappe) పీఎస్జీని వీడుతాడనే వార్తలు వినిపించాయి. కానీ, యాజమాన్యం, ఎంబాపే మధ్య సఖ్యత కుదిరింది. మళ్లీ అతడిని తొలి ప్రాధాన్య జట్టులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.