ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆదివారం దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో 250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 49 పరుగులకు ఓపెనర్లిద్దరిని కోల్పోయింది. తొలుత ఓపెనర్ రుచిన్ రవీంద్రను హార్దిక్ పాండ్యా నాలుగో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ బాట పట్టించాడు. హార్దిక్ పాండ్య వేసిన బంతికి అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి రుచిన్ రవీంద్ర పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోర్ 23/1. ఇక 12వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి వేసిన మూడో బంతిని ఆడబోయిన విల్ యంగ్ బౌల్డయ్యాడు. అప్పటికి విల్ యంగ్ మూడు ఫోర్లతో 22 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కేన్ విలియమ్సన్, డెరిల్ మిచెల్ బ్యాటింగ్ చేస్తున్నారు.