ICC Champions Trophy | నాలుగు వికెట్లు కోల్పోయినా నిలకడగా ఆడుతున్న డెరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ జోడికి వరుణ్ చక్రవర్తి బ్రేక్ వేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్లో 165 పరుగుల వద్ద కివిస్ ఐదో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి 37వ ఓవర్లో వేసిన ఐదో బంతిని కొట్టబోయిన గ్లెన్ ఫిలిప్స్ బౌల్డ్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఐదో వికెట్ భాగస్వామ్యానికి మిచెల్, ఫిలిప్స్ జోడీ 50 పరుగులు జత చేసింది. అంతకు ముందు 57 పరుగుల వద్ద ఓపెనర్ విల్ యంగ్, 69 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర, 75 పరుగులకు కేన్ విలియమ్సన్, 108 పరుగులకు టామ్ లాథమ్ పెవిలియన్ బాట పట్టారు.