ODI World Cup | 246 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తొలి పది ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసింది. డెవాన్ కాన్వేతో కలిసి సారధి కానే విలియమ్స్ సన్ జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. కానే విలియమ్సన్ 10, డెవోన్ కాన్వే 15 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు.
అంతకుముందు మూడో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన నాలుగో బంతి.. ఓపెనర్ రచిన్ రవీంద్రా బ్యాట్ ఎడ్జి మీదుగా వికెట్ కీపర్ ముషిఫికర్ రహీం చేతుల్లో పడటంతో రచిన్ రవీంద్రా పెవిలియన్ దారి పట్టాడు. అంతకుముందు రెండు ఫోర్లతో రచిన్ రవీంద్రా మెరుపులు మెరిపించాడు.