Sophie Devine : న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డెవినె (Sophie Devine) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నిరుడు మహిళల జట్టును పొట్టి వరల్డ్ కప్ (T20 World Cup) విజేతగా నిలిపిన ఆమె.. వన్డేలకు అల్విదా చెప్పనుంది. వన్డే వరల్డ్ కప్ అనంతరం వన్డే ఫార్మాట్ నుంచి వైదొలగాలని ఆమె భావిస్తోందట. ఈ విషయాన్ని మంగళవారం ఈ విధ్వంసక ప్లేయర్ వెల్లడించింది. ’50 ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా’ అని డెవినె తెలిపింది. న్యూజిలాండ్ క్రికెట్ కూడా ఈ వార్తను ధ్రువీకరించింది.
‘ఇన్ని రోజులు దేశానికి ప్రాతినిధ్యం వహించాను. ఇక వన్డేల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. వన్డే వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ పలకడం మంచిదని అనిపిస్తోంది. న్యూజిలాండ్ క్రికెట్ మద్దతు నాకు ఇన్నాళ్లు లభించడం అదృష్టంగా భావిస్తున్నా. వీడ్కోలుకు ముందు వైట్ ఫెర్న్స్‌కు నేను చేయగలిగినంత చేస్తాననే నమ్మకం నా సహచరులకు ఉంది.
యువ క్రికెటర్లతో నిండిన ఈ జట్టు ప్రయాణం గొప్పగా సాగాలని కోరుకుంటున్నా. వచ్చే 6 నుంచి 9 నెలలు ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా’ అని డెవినె తెలిపింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 న మొదలు కానుంది. అక్టోబర్ 1న ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో కివీస్ తలపడనుంది.
న్యూజిలాండ్ మహిళల జట్టులో కీలక సభ్యురాలైన డెవిన్ వన్డే, టీ20ల్లో తన ముద్ర వేసింది. 11వ నంబర్ ప్లేయర్‌గా వన్డేల్లో అరంగేట్రం చేసిన తను.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. 2020లో కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న డెవిన్ వెటరన్ సుజీ బేట్స్ తర్వాత కివీస్ తరఫున అత్యధికంగా 152 మ్యాచులు ఆడింది. విధ్వంసక ప్లేయర్ అయిన డెవిన్ వన్డేల్లో 8 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు బాదింది. ఆల్‌రౌండర్‌గా రాణించిన తను.. 3,990 రన్స్ చేయడమే కాకుండా 107 వికెట్లు పడగొట్టింది.
New Zealand captain Sophie Devine will retire from ODI cricket after the 50-over World Cup in India and Sri Lanka later this year, but will remain available for T20Is under a casual playing agreement with New Zealand Cricket
Read more 🔗 https://t.co/JlppzGuHth pic.twitter.com/ULFoCSnGFl
— ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2025