Orphaned student | శక్కర్ నగర్ : బోధన్ పట్టణానికి చెందిన ఓ అనాథ బాలుడిని మంగళవారం బోధన్ లోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో సామాజిక కార్యకర్త సనా పటేల్ చేర్పించారు. సదరు బాలుని తల్లిదండ్రులు మృతిచెందగా ఈ విషయం తెలుసుకున్న సనా పటేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ బషీర్ తో మాట్లాడి, సంబంధిత అధికారుల ద్వారా అనుమతి తెచ్చి పాఠశాలలో చేర్పించారు. తాను పేద విద్యార్థులకు విద్యాభ్యాసం పూర్తిస్థాయిలో అందాలనే ధ్యేయంతో తన వంతుగా సేవలందిస్తున్నానని సనా పటేల్ అన్నారు. ఇప్పటివరకు పలువురు చిన్నారులను పాఠశాలల్లో చేర్పించినట్లు, కొన్ని పాఠశాలల్లో పలువురు దాతల సహకారంతో నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు కూడా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా నిరుపేద విద్యార్థులకు విద్యాభ్యాసానికి తమ వంతు సహకారం అందించాలని సనా పటేల్ కోరారు.