MIM | శక్కర్ నగర్ : ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ని మంగళవారం బోధన్ పట్టణ పార్టీ అధ్యక్షుడు మీరి ఇలియాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన మీర్ ఇలియాజ్ అలీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల బోధన్ పట్టణ ఎంఐఎం నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన అసదుద్దీన్ ఓవైసీ ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ పట్టణంలో ఎంఐఎం పరిస్థితిపై రాష్ట్ర అధ్యక్షునికి నివేదింఛానని, సంస్థ గత ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు.