Baahubali | ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన క్రేజీ ప్రాజెక్ట్ బాహుబలి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, నాజర్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. అనేక రికార్డులు తిరగరాసింది. రెండు పార్ట్‌లుగా రూపొందిన ఈ చిత్రం హాలీవుడ్ ప్రముఖులని సైతం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ చిత్రంలో తమన్నాకి డూప్‌గా బిగ్ బాస్ భామ భాను శ్రీ నటించిందట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది భాను. బాహుబలి సినిమాలో తమన్నా ఫ్రెండ్స్ లో ఒక క్యారెక్టర్ చేసిన భాను శ్రీ తమన్నా డూప్‌గా కూడా చేసినట్టు పేర్కొంది.
నేను డ్యాన్సర్ గా చేస్తున్నప్పుడు తమన్నాకు డూప్ గా చేయమని ఆఫర్ ఇచ్చారు. అయితే అది బాహుబలి సినిమా అని నాకు తెలీదు. మొదట చేయను అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు రెమ్యునరేషన్ బాగా పెంచడంతో ఓకే చెప్పాను. సెట్ కి వెళ్ళాక అది బాహుబలి సినిమా అని తెలిసింది. 17 రోజులు తమన్నాకు డూప్ గా నటించాను. ఆ తర్వాత నా యాటిట్యూడ్, యాక్టింగ్ చూసి తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ కి తీసుకున్నారని పేర్కొంది భాను శ్రీ. ఈ అమ్మడు బిగ్ బాస్ తర్వాత ఢీ షోలో మెంటర్ గా చేసింది కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మధ్యలోనే వెళ్ళిపోయింది.అందుకు గల కారణం కూడా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ తర్వాత ఢీ ఆఫర్ వస్తే బిగ్ బాస్ టీమ్ కి చెప్పే ఆ షో చేశాను. కానీ అయిదు ఎపిసోడ్స్ పూర్తి అయిన తర్వాత నాకు ఫోన్ చేసి మీరు ఆ షో చేయొద్దు అన్నారు. నేను మీకు చెప్పినప్పుడు ఒకే అన్నారు కదా, అందుకే చేస్తున్నాను అని చెప్పాను. అయితే మా రీజన్స్ మాకు ఉన్నాయి. అగ్రిమెంట్ లో మీరు వేరే ఛానల్ షోలు చేయొద్దు అని ఉంది కదా అన్నారు. దాంతో మధ్యలో వెళ్ళిపోయా. నేను డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి ఢీలో ఒక డ్యాన్స్ టీమ్ కి మెంబర్ అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కాని మధ్యలోనే వెళ్లిపోవాల్సి రావడం చాలా బాధ కలిగించిందని భాను శ్రీ ఇంటర్వ్యూలో పేర్కొంది.