ICC Awards: గతేడాది భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్లో అంచనాలకు మించి రాణించిన క్రికెటర్లలో న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఒకడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లోనే సెంచరీ బాది ఆ తర్వాత సిరీస్ ఆధ్యంతం అద్భుతంగా ఆడిన రవీంద్రకు గతేడాది ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2023కు గాను రచిన్ రవీంద్ర ‘ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, దక్షిణాఫ్రికా పేస్ సంచలనం గెరాల్డ్ కొయెట్జ్, శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక లను కాదని రవీంద్రకు ఈ అవార్డు దక్కింది.
వన్డే వరల్డ్ కప్లో రవీంద్ర.. 578 పరుగులు చేశాడు. గతేడాది వన్డేలలో రవీంద్ర.. 820 పరుగులు చేయగా అందులో అగ్రభాగం ప్రపంచకప్లో చేసినవే కావడం విశేషం. అంతేగాక బౌలర్గా కూడా రవీంద్ర 18 వికెట్లు తీశాడు. ఐసీసీ అవార్డు రావడంపై రవీంద్ర స్పందిస్తూ… ‘ఐసీసీ గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఐసీసీ గుర్తింపు ఎప్పటికైనా ప్రత్యేకమే..’ అని అన్నాడు.
The sensation who took #CWC23 by storm 🔥
New Zealand’s up-and-coming star clinches the ICC Men’s Emerging Cricketer of the Year 2023 👏https://t.co/GWLhWfp7BQ
— ICC (@ICC) January 24, 2024
మహిళల జాబితాలో ఈ అవార్డు ఆస్ట్రేలియా యువ క్రికెటర్, 20 ఏండ్ల ఫోబె లిచ్ఫీల్డ్కు దక్కింది. గతేడాది లిచ్ఫీల్డ్.. టెస్టులలో 87, వన్డేలలో 344, టీ20లలో 88 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ప్లేయర్ మరూఫా అక్తర్, లారెన్ బెల్ (ఇంగ్లండ్), స్కాట్లాండ్ ఆల్రౌండర్ డార్సే కార్టర్లను అధిగమించి అవార్డును దక్కించుకుంది.
Just 20 years old and making waves in international cricket 🙌
Australia’s top-order powerhouse takes home the ICC Women’s Emerging Cricketer of the Year 2023 🏅https://t.co/7w5jyhfcwT
— ICC (@ICC) January 24, 2024