క్రైస్ట్‌చర్చ్: సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన న్యూజిలాండ్ జట్టు.. 18 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ నెగ్గింది. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 276 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 95 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 482 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 111 పరుగులకే పరిమితమైంది. టెంబా బవుమా (41) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కివీస్ బౌలర్లో సీనియర్ పేసర్ సౌథీ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టును కుప్పకూల్చిన న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ (7/23)కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.