బ్రిస్బేన్: టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని విసిరింది ఇంగ్లండ్. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరు ఓపెనర్లు రాణించడంతో.. ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. తొలి వికెట్‌కు బట్లర్, హేల్స్ 81 రన్స్ జోడించారు. హేల్స్ 52, బట్లర్ 73 రన్స్ చేసి ఔటయ్యారు.
England have set a competitive target of 180 for New Zealand 💪#ENGvNZ | 📝: https://t.co/LTgE7VWHFc
Head to our app and website to follow the #T20WorldCup action 👉 https://t.co/76r3b7l2N0 pic.twitter.com/X8FuEOHOHc
— ICC (@ICC) November 1, 2022
టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందు బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే పవర్‌ప్లేలో ఓపెనర్లు 48 రన్స్ జోడించారు. కానీ కివీస్ బౌలర్లు ఇంగ్లండ్ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నారు. ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగాయి.