హామిల్టన్(న్యూజిలాండ్): ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టుపై న్యూజిలాండ్ మరింత పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 136/3తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్ 453 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(156) సెంచరీతో కదంతొక్కగా, మిచెల్(60) ఆకట్టుకున్నాడు.
ఇంగ్లండ్ బౌలర్లను ఉతికిఆరేస్తూ విలియమ్సన్ టెస్టుల్లో 33వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. 658 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సరికి 18 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.