హామిల్టన్ : ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో న్యూజిలాండ్ 423 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం ముగిసిన టెస్టులో కివీస్ నిర్దేశించిన 658 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు 18/2తో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 234 పరుగులకు ఆలౌటైంది. పిచ్ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ కివీస్ బౌలర్లు సాంట్నర్ (4/85), సౌథీ (2/34), హెన్రీ (2/62) ధాటికి ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. బెతెల్ (76), రూట్ 54) అర్ధసెంచరీలతో రాణించారు. గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్‌కు రాలేదు. సాంట్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, బ్రూక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది. న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ టిమ్ సౌథీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు.