బులవాయొ: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజీలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగుల ఆధిక్యం దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 149 రన్స్ చేయగా కివీస్ 96 ఓవర్లలో 307 రన్స్‌కు ఆలౌట్ అయింది. కాన్వే (88), మిచెల్ (80), యంగ్ (41) రాణించారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జింబాబ్వే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 127 రన్స్ వెనుకబడి ఉంది.