కరాచీ : స్వదేశంలో చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆతిథ్య పాకిస్థాన్ భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాక్.. 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 49.3 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46), సల్మాన్ అగా (45), తయ్యబ్ తాహిర్ (38) పాక్‌ను ఆదుకున్నారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఒరూర్కి (4/43), కెప్టెన్ శాంట్నర్ (2/20) పాక్ బ్యాటర్లను కట్టడిచేశారు. ఛేదనలో కివీస్.. 45.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డారిల్ మిచెల్ (57), టామ్ లాథమ్ (56) అర్ధ సెంచరీలతో రాణించి కివీస్‌కు ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించారు.