హామిల్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. యంగ్(60), విలియమ్సన్(50) అర్ధసెంచరీలతో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. చేతిలో 7 వికెట్లు ఉన్న కివీస్ ప్రసుత్తం 340 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. స్టోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.
తొలుత ఓవర్‌నైట్‌స్కోరు 315/9 రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్ 347 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్.. హెన్రీ (4/48), రూర్కీ (3/33), సాంట్నర్ (3/7) ధాటికి 143 పరుగులకు ఆలౌటైంది.