గువాహటి: మహిళల వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై కివీస్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 39.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది.
జెస్కెర్ (3/21), లీ తుహుహు (3/22) ధాటికి బంగ్లా బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. తొలుత బ్రూక్ హాలీడే(69), సోఫీ డివైన్(63) అర్ధసెంచరీలతో కివీస్ 50 ఓవర్లలో 227/9 స్కోరు చేసింది. నాలుగో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రబేయా (3/30) ఆకట్టుకుంది.