ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనను న్యూజిలాండ్ విజయంతో ముగించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి పోరులో ఆతిథ్య జట్టు నెగ్గగా రెండో మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ నేపథ్యంలో శనివారం ఢాకా వేదికగా జరిగిన మూడో టీ20లో కివీస్ 6 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) బంగ్లాను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన పోరులో ఆతిథ్య జట్టు.. 14.2 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. తౌహిద్ హృదయ్ (33) టాప్ స్కోరర్. క్లార్క్సన్ (3/9), సీర్స్ (2/12), స్మిత్ (2/14) బంగ్లాను కట్టడిచేశారు. ఛేదనను కివీస్ 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. బెవాన్ జాకబ్స్ (31 బంతుల్లో 62 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.