న్యూఢిల్లీ: న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson).. భారత్‌తో జరగనున్న మూడవ టెస్టు కూడా దూరం కానున్నాడు. ముంబైలో జరిగే ఆ మ్యాచ్‌కు విలియమ్సన్ అందుబాటులో ఉండరని కివీస్ తెలిపింది. గజ్జల నొప్పితో బాధపడుతున్న విలియమ్సన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టులకు కూడా కివీస్ మాజీ కెప్టెన్ దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంతో ఉన్నది.
నవంబర్ ఒకటో తేదీ నుంచి వాంఖడే స్టేడియంలో మూడవ టెస్టు జరగనున్నది. కేన్ విలియమ్సన్ ఆరోగ్యం ప్రస్తుతం మంచి స్థితిలోనే ఉన్నా.. అతను జట్టుతో కలవడం లేదని కోచ్ గ్యారీ స్టడ్ తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో అతనికి పూర్తి రెస్టు ఇస్తున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్‌తో నవంబర్ 28వ తేదీ నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో తొలి టెస్టు జరగనున్నది.
Squad News | Kane Williamson will not travel to India for the third Test in Mumbai to ensure he his fit for the upcoming three-Test series against England 🏏 #CricketNationhttps://t.co/HpqP4w6Ufp
— BLACKCAPS (@BLACKCAPS) October 29, 2024