ICC Champions Trophy | లాహోర్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన భారత జట్టు ప్రత్యర్థి ఎవరో బుధవారం తేలనుంది. లాహోర్ వేదికగా జరుగబోయే రెండో సెమీస్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఐసీసీ టోర్నీలలో ఇప్పుడిప్పడే ‘చోకర్స్’ అన్న ముద్రను తొలిగించుకుంటున్న దక్షిణాఫ్రికా.. నిలకడగా ఆడే న్యూజిలాండ్‌తో కీలక పోరులో ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమంగా ఉండటంతో సెమీస్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. అయితే వరుసగా గాయాలతో సతమతమవుతున్న సఫారీలకు తాజాగా మార్క్మ్ గాయం వేధిస్తోంది. కివీస్‌తో మ్యాచ్‌లో అతడు ఆడతాడా? లేదా? అన్నది మ్యాచ్ సమయానికి తేలనుంది.