బెంగుళూరు: భారత్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో.. న్యూజిలాండ్(New Zealand All Out) జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ 356 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 134 రన్స్ చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ టిమ్ సౌథీ 65 రన్స్ చేశాడు. ఎనిమిదో వికెట్‌కు రవీంద్ర, సౌథీలు.. 137 రన్స్ జోడించారు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా, బుమ్రా-అశ్విన్‌కు చెరో వికెట్ దొరికింది. రచిన్ రవీంద్ర సెంచరీలో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
Innings Break!
New Zealand all out for 402.
3⃣ wickets each for @imjadeja & @imkuldeep18
2⃣ wickets for @mdsirajofficial
1⃣ wicket each for vice-captain @Jaspritbumrah93 & @ashwinravi99Scorecard ▶️ https://t.co/8qhNBrrtDF#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/CWyn6Zbq0x
— BCCI (@BCCI) October 18, 2024