హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): న్యాయవ్యవస్థను డిజిటలైజ్ చేయడంతోపాటు న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొత్తగా మరో 29 ఈ-సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వాటిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మంగళవారం ప్రారంభించారు.
అనంతరం ఆయన హైకోర్టు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.