IND vs USA : అమెరికా పేసర్ సౌరభ్ నేత్రవల్కర్(saurabh netravalkar) భారత్‌పై తన బౌలింగ్ పవర్ చూపిస్తున్నాడు. 110 పరుగుల స్వల్ప ఛేదనలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు వికెట్లు తీసి అమెరికాకు బిగ్ బ్రేకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అతడు విరాట్ కోహ్లీ(0)ని గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. అనంతరం రెండో ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(3)ను ఔట్ చేసి భారత్ ప్రేక్షకులను ముక్కునవేలేసుకునేలా చేశాడు.
10 పరుగులకే రెండు వికెట్లు పడిన దశలో రిషభ్ పంత్(13), సూర్యకుమార్ యాదవ్(15)లు భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నారు. వీళ్లు ఇప్పటికే మూడో వికెట్‌కు రన్స్ జోడించారు. దాంతో, టీమిండియా పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. రోహిత్ సేన విజయానికి ఇంకా 84 బంతుల్లో 78 రన్స్ కావాలి.