Vivian Kingma : అంతర్జాతీయ క్రికెట్లో మరో ఆటగాడు డోపింగ్ టెస్టులో దొరికిపోయాడు. నెదర్లాండ్స్ పేసర్ వివియన్ కింగ్మా (Vivian Kingma) నిషేధిత డ్రగ్ తీసుకొని పట్టుబడ్డాడు. ఐసీసీ నిషేధించిన డ్రగ్ వాడినందుకు అతడిని మూడు నెలలు సస్పెండ్ చేసింది. కింగ్మా రక్త నమూనాలో బెంజోయ్లెకాగ్నిన్ (Benzoylecgonine) అనే కొకైన్ సంబంధిత మెటబాలిక్ బయటపడింది. తాను చేసినతప్పును కింగ్మా అంగీకరించాడు. తాను ఉద్దేశపూర్వంగా ఆ డ్రగ్ తీసుకోలేదని అతడు వెల్లడించాడు.
ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ లీగ్ 2లో భాగంగా మే 12వ తేదీన యూఈఏతో జరిగిన మ్యాచ్ అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో, కింగ్మాపై చర్యలకు సిద్ధమైన ఐసీసీ పేసర్‌పై మూడు నెలల అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని ఐసీసీ వెల్లడించింది. దాంతో.. యూఏఈతో వన్డేలో, అనంతరం నేపాల్, స్కాట్లాండ్పై ఈ డచ్ పేసర్ గణాంకాలను ఐసీసీ రద్దు చేయనుంది. ఒకవేళ ఐసీసీ డ్రగ్ నిరోధక విభాగంలో కింగ్మా ఇష్టపూర్వకంగా చికిత్స తీసుకుంటే అతడు ఒక నెల నిషేధం తప్పించుకునే అవకాశముంది.
Netherlands pacer Vivian Kingma receives a three-month ban for violating the ICC Anti-Doping Code.
The 30-year-old tested positive for Benzoylecgonine, a cocaine metabolite, during the ICC Men’s Cricket World Cup League 2 ODI against UAE in Utrecht on May 12. pic.twitter.com/LDLSRdvHi7
— CricTracker (@Cricketracker) September 16, 2025
అథ్లెట్లు మాత్రమే కాదు ఈమధ్య క్రికెటర్లు కూడా డోప్ పరీక్షలో పట్టుబడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు కగిసో రబడ (Kagiso Rabada) డోప్ పరీక్షలో దొరికాడు. న్యూజిలాండ్ ప్లేయర్ డౌగ్ బ్రాస్‌వెల్ సైతం డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ పునరావాస కేంద్రంలో గడిపి బయటకొచ్చారు. నిషేధం ముగియడంతో పద్దెనిమిదో సీజన్ మధ్యలో గుజరాత్ టైటన్స్ జట్టుతో చేరాడు రబడ.