పంజిమ్: తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి చెస్ ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో భాగంగా లెవొన్ అరోనియన్ (యూఎస్)తో జరిగిన పోరులో తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న అర్జున్.. రెండో గేమ్‌లో మాత్రం పట్టు కోల్పోకుండా ప్రత్యర్థిని చిత్తుచేశాడు.
ఇదిలాఉండగా ఈ టోర్నీ రేసులో నిలిచిన మరో భారత గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణ.. జోస్ ఎడ్వర్డ్ మార్టినెజ్ (మెక్సికో)తో రెండో గేమ్నూ డ్రా చేసుకున్నాడు. ఆదివారం జరిగే టై బ్రేకర్‌తో వారిలో విజేత ఎవరో తేలనుంది.