టెక్సాస్: టీ20 వరల్డ్‌కప్(T20 Worldcup) మ్యాచ్‌లో ఇవాళ నేపాల్‌పై ఆరు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ నెగ్గింది. మరో 8 బంతులు ఉండగానే ఆ జట్టు విజయాన్ని నమోదు చేసింది. గ్రాండ్ ప్రియరీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 19.2 ఓవర్లలో 106 రన్స్ చేసింది. నేపాల్ జట్టు రెగ్యులర్‌గా వికెట్లను కోల్పోయింది. ఆ జట్టులో కెప్టెన్ రోహిత్ పౌడెల్ ఒక్కడే అత్యధికంగా 35 రన్స్ చేశాడు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకున్నది. డచ్ బ్యాటర్ మ్యాక్స్ ఓదౌడ్ 48 బంతుల్లో 54 పరుగులు చేశాడు.వరల్డ్‌కప్‌లో ఇవాళ రాత్రి న్యూయార్క్‌లో జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్ తలపడనున్నది. ఆస్ట్రేలియాతో ఒమన్, పాపువా న్యూ గినియాతో ఉగండ తలపడనున్నాయి.
Max O’Dowd’s gritty 54* guides the Netherlands to a victory against Nepal in Dallas 👏#T20WorldCup | #NEDvNEP | 📝: https://t.co/7nIrGHHwI5 pic.twitter.com/WgYhfDW6QD
— T20 World Cup (@T20WorldCup) June 4, 2024