డల్లాస్: బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో నేపాల్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ గెలుపు దిశగా సాగుతోంది. డల్లాస్‌లోని గ్రాండ్ ప్రియారి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్.. డచ్ బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది. నేపాల్ సారథి రోహిత్ పౌడెల్ (35), గుల్షన్ ఝా (14) ఫర్వాలేదనిపించగా మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. డచ్ బౌలర్లలో వాన్ బీక్ (3/18), టిమ్ ప్రింగిల్ (3/20), వాన్ మికెరెన్ (2/19), బస్ డి లిడె (2/22) సమిష్టిగా విజృంభించడంతో నేపాల్ విలవిల్లాడింది. స్వల్ప ఛేదనలో నెదర్లాండ్స్.. కడపటి వార్తలందేసరికి 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి గెలుపు దిశగా సాగుతోంది.