Nepal Cricket : ప్రపంచంలోనే సంపన్నమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి నేపాల్ క్రికెట్(Nepal Cricket) ధన్యవాదాలు తెలిపింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో తమ జట్టు శిక్షణ క్యాంప్ ముగిసిన సందర్భంగా నేపాల్ బోర్డు ఎక్స్‌లో ప్రత్యేక పోస్ట్ పెట్టింది. అన్ని వసతులతో కూడిన ఎన్సీఏలో శిక్షణ శిబిరానికి అనుమతి ఇచ్చినందుకు బీసీసీఐకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.
తమ జట్టు క్యాంప్ నిర్వహణలో సహకరించిన సెక్రటరీ జై షా, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.శివశంకర్‌కు నేపాల్ క్రికెట్ కృతజ్ఞతలు చెప్పింది. ‘బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ క్యాంపు విజయవంతంగా ముగిసింది. త్వరలో జరుగబోయే ఐసీసీ సీడబ్ల్యూసీ లీగ్ 2 సైకిల్ సిరీస్ కోసం మేము సన్నద్ధమయ్యాం. ఈ క్యాంప్ నిర్వహణను సాధ్యం చేసిన గౌరవనీయులు ఎస్.జై శంకర్, బీసీసీఐ సెక్రటరీ జై షాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని నేపాల్ క్రికెట్ తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
🏏Concluding a successful training camp at the National Cricket Academy (NCA) in Bangalore as we gear up for the upcoming series in the ICC CWC League 2 cycle. 🇳🇵🇮🇳Our sincere thanks to Honorable @DrSJaishankar, the @BCCI, Hon. Secretary @JayShah, and @IndiaInNepal for making… pic.twitter.com/XRpaP9czaV
— CAN (@CricketNep) August 27, 2024
క్రికెట్ క్యాంప్ కోసం నేపాల్ జట్టు భారత్‌కు రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఆరంభంలో టీ20 వరల్డ్ కప్ సన్నద్ధతలో భాగంగా నేపాల్ టీమ్ ఇండియాలో అడుగుపెట్టింది. గుజరాత్, బరోడా జట్లతో కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు సీడబ్ల్యూసీ లీగ్ 2 కోసం మళ్లీ పసికూన జట్టు భారత్‌ను ఆశ్రయించింది. ఎన్సీఏలో నేపాల్ క్రికెటర్లకు అనుభవజ్ఞులైన రాహుల్ ద్రవిడ్, పేసర్ మహ్మద్ షమీలు విలువైన సలహాలు ఇచ్చారు. సీడబ్ల్యూసీ లీగ్ 2లో అనుసరించాల్సిన వ్యూహాలను నేపాల్ కుర్రాళ్లకు మాజీ కోచ్ ద్రవిడ్ వివరించాడు.