T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. మరో నెల రోజుల్లో యూఏఈ(UAE) వేదికగా మెగా టోర్నీ మొదలవ్వనుంద. దాంతో, పలు దేశాల బోర్డులు ప్రపంచ కప్ స్క్వాడ్‌ను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) సైతం వరల్డ్ కప్ లక్ష్యంగా మంగళవారం 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
రెండోసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ వేటలో ఉన్న ఇంగ్లండ్‌కు హీథర్ నైట్(Heather Knight) కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వరల్డ్ కప్ బెర్తుపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు కేట్ క్రాస్(Kate Cross), టమ్మీ బ్యూమంట్లను మాత్రం సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. ఇక.. వికెట్ కీపర్ బెస్ హీథ్, ఆల్‌రౌండర్ ఫ్రెయా కెంప్లు తొలిసారి వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.
UAE here we come! 🛫
Dropping our #T20WorldCup squad right here 👇#EnglandCricket pic.twitter.com/5QwLSetODP
— England Cricket (@englandcricket) August 27, 2024
ఇంగ్లండ్ స్క్వాడ్ : హీథర్ నైట్(కెప్టెన్), లారెన్ బెల్, మైయ బౌచియర్, అలిసే క్యాప్సే, చార్లీ డీన్, సోఫీయ డంక్లే, సోఫీ ఎకిల్‌స్టోన్, డానియెల్లె గిబ్సన్, సరాహ్ గ్లెన్, బెస్ హీథ్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, లిన్సే స్మిత్, డానియల్ వ్యాట్.
ప్రపంచ కప్ ఆరంభ పోరులో ఇంగ్లండ్ జట్టు బంగ్లాదేశ్(Bangladesh)ను ఢీ కొట్టనుంది. గ్రూప్ దశలో భాగంగా ఆ తర్వాత దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, వెస్టీండీస్లో హీథర్ నైట్ బృందం తలపడనుంది. మహిళల పొట్టి ప్రపంచ కప్ తొలి సీజన్(2009)లో చాంపియన్‌గా అవతరించిన ఇంగ్లండ్ ఆ తర్వాత మళ్లీ టైటిల్ గెలవలేదు. అంతేకాదు కనీసం ఫైనల్ కూడా వెళ్లలేదు. దాంతో, ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే కసితో ఇంగ్లీష్ జట్టు ఉంది.