Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 13.65 పాయింట్ల లబ్ధితో 81,711.76 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 7.15 పాయింట్లు పుంజుకుని 25,017.75 పాయింట్ల వద్ద ముగిశాయి. త్వరలో కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని యూఎస్ ఫెడ్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తున్నారు.
ఎన్ఎస్ఈ -50లోని 50 స్టాక్స్ కు 31 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. వాటిలో టైటాన్ కంపెనీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, గ్రాసిమ్ తదితర స్టాక్స్ 2.04 శాతం వరకూ నష్టపోయాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో 30 స్టాక్స్‌కు గాను 19 స్టాక్స్ నష్టపోయాయి. హిందూస్థాన్ యూనీ లివర్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, ఎన్టీపీసీ తదితర సంస్థలు 2.01 శాతం వరకూ పతనం అయ్యాయి. బజాజ్ ఫిన్ సర్వ్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లబ్ధి పొందాయి.
నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.05 శాతం లాభ పడింది. మీడియా, ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్సులు మాత్రం 4.10 శాతం వరకూ లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ లు నష్టపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.83.92 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 80.93 డాలర్లు పలుకుతున్నది. ఔన్స్ బంగారం 2543 డాలర్ల వద్ద తచ్చాడుతున్నది. మరోవైపు సోనీతో వివాదం ముగియడంతో జీ ఎంటర్ టైన్ మెంట్ షేర్ 11.4 శాతం పుంజుకుని రూ.150 వద్ద నిలిచింది.