MLC Kavitha | న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది. కవిత పూచీకత్తు బాండ్లను రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. కవితకు పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్ కుమార్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమర్పించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ లభించింది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. దీంతో దాదాపు 165 రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు.
ఇవాళ రాత్రి 7 గంటల తర్వాత కవిత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇవాళ రాత్రికి ఆమె ఢిల్లీలోనే బస చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, కేటీఆర్, హరీష్ రావు రానున్నారు. ఇక రేపు ఉదయం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు ఎమ్మెల్సీ కవిత
Vinod Kumar | కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కవితపై కుట్ర కేసు : వినోద్ కుమార్
Apple – Jobs | ఉద్యోగార్థులకు ఆపిల్ ఆఫర్.. ఏడు నెలల్లో ఆరు లక్షల కొలువులు