దుబాయ్: భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌కు అత్యున్నత గౌరవం లభించింది. ఆమెకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. నీతూతో పాటు ఇంగ్లండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్నూ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చుతున్నట్టు ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుతం టీమ్ఇండియా మహిళా క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తున్న నీతూ డేవిడ్.. డయానా ఎడుల్జి తర్వాత భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న రెండో మహిళా క్రికెటర్. భారత్ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు ఆడిన నీతూ.. వన్డే ఫార్మాట్లో వంద వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్ (టీమ్ఇండియా నుంచి)గా రికార్డులకెక్కింది. అంతర్జాతీయ క్రికెట్లో 20వేలకు పైగా పరుగులు చేసిన కుక్‌తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ‘మిస్టర్ 360’గా పిలుచుకునే డివిలియర్స్కూ ఈ గుర్తింపు దక్కింది.