జ్యూరిచ్: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు. ఇటీవల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్.. డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోటీలో ఒలింపిక్ చాంపియన్ నీరజ్ బరిసెను 85.71 మీటర్ల దూరం విసిరాడు.
సాధారణంగా మొదటి రెండు రౌండ్లలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే నీరజ్.. ఈ సారి చివరి ప్రయత్నం (ఆరో రౌండ్)లో బరిసేను అత్యధిక దూరం విసిరాడు. ఆరు రౌండ్లలో మూడు సార్లు ఫౌల్ చేసిన 25 ఏండ్ల నీరజ్.. వరుసగా 80.79 మీటర్లు, 85.22 మీటర్లు, 85.71 మీటర్ల దూరాన్ని నమోదు చేశాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకబ్ వాడ్లిచ్ (85.86 మీటర్లు) అగ్రస్థానం దక్కించుకున్నాడు. ‘శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉన్నా. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంతో కాస్త ఆలసట సహజమే’ అని నీరజ్ పేర్కొన్నాడు.